కర్నూలు: వైయస్ జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. జనాన్ని అడ్డుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని, నంద్యాల టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్సీ రమేష్‌ను, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలు నియోజకవర్గాల నుంచి కర్నూలుకు వస్తున్న నాయకులు, కార్యకర్తలను నిలువరించినప్పటికీ పోలీసుల ఆంక్షలను ఛేదించి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కర్నూలుకు చేరుకుని వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు.