కర్నూలు: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బాధితులనే నిందితులుగా మార్చడం, దాడికి గురైన వారిపైనే కేసులు పెట్టడం, బాధితులకు అండగా నిలిచిన వారిని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారిందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి వందలాది మంది పోలీసులతో దాడి చేసి, తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం ఇందుకు పరాకాష్ట అని పేర్కొన్నారు. కర్నూలు జైల్‌లో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ అనంతరం వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఆరు కిలోమీటర్ల దూరంలో దాడి.. పోలీసులకు వరుస ఫోన్లు ఆగస్టు 1న చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త గిరిపై, ఆయన ఇంటిపై దాడి జరిగింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యేకు గిరి రాత్రి 7.45 గంటలకు ఫోన్ చేసి, తనపై దాడి జరుగుతోందని, తన ఇంటి ఫొటోలు, వీడియోలు కూడా పంపించి రక్షించాలని కోరాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్‌ఐకి ఫోన్ చేసి సంఘాల వెళ్లి గిరిని కాపాడాలని కోరారు. అనంతరం సీఐకి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఉదయం 8.03 గంటలకు మరోసారి సీఐకి సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేదని తెలిపారు. బాధితుడిని కాపాడేందుకు వెళ్తే మొదటి కేసు పోలీసులు స్పందించకపోవడంతో గిరిని కాపాడేందుకు ఎమ్మెల్యే స్వయంగా సంఘాల గ్రామానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్ది, గిరిని తన కారులో ఎక్కించుకుని చిప్పగిరికి తీసుకువస్తుండగా నేమకల్లు వద్ద ఎమ్మెల్యేపైనే దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు గాయపడి చేయి విరిగిందని పేర్కొన్నారు. బాధిత కార్యకర్తను కాపాడేందుకు వెళ్లడాన్నే ఎమ్మెల్యేపై పెట్టిన మొదటి కేసుగా మార్చారని అన్నారు. దాడి చేసిన వారే బాధితులుగా మారిన వింత కేసు నేమకల్లు ఘటనను కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపి, ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు చింపారంటూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని వైయస్ఆర్‌సీపీ నాయకుడు ఆరోపించారు. ఇది ఎమ్మెల్యేపై పెట్టిన రెండో కేసు అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినా కేసు నమోదు చేయలేదు దాడిలో గాయపడిన ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు, దాడికి గురైన గిరిని తీసుకుని ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయాలని కోరినా పోలీసులు కనీసం ఫిర్యాదును కూడా తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వెళ్లినా బాధితుల ఫిర్యాదు స్వీకరించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇది నాలుగో తప్పిదమని పేర్కొన్నారు. బాధితులపైనే రివర్స్ కేసులు ఫిర్యాదు తీసుకోకపోవడమే కాకుండా బాధితులైన విరూపాక్ష, ఆయన కుటుంబ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపైనే రివర్స్ కేసులు పెట్టారని తెలిపారు. సంఘాల ఘటనకు సంబంధించిన ఫిర్యాదులోనే పలువురి పేర్లు వేర్వేరు నిందితుల జాబితాల్లో మళ్లీ మళ్లీ పునరావృతం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ లేకుండానే కేసుల్లో పేర్లు చేర్చినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది ఐదో తప్పిదమని తెలిపారు. మూడు కేసులు.. 38 మంది రిమాండ్ గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై వరుసగా మూడు కేసులు పెట్టారని తెలిపారు. ఒక కేసులో 34 మందిని చేర్చగా, తరువాతి కేసుల్లో మరికొందరి పేర్లు జోడించారని, చివరకు మొత్తం 38 మందిని రిమాండ్‌కు పంపిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు, సోదరుడు, సోదరుడి కుమారుడినీ కేసుల్లోకి లాగి మొత్తం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.45 గంటలకు ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరు తప్పిదాల్లో అత్యంత దారుణమైనది ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి జరిగిన దాడి అని అన్నారు. రాత్రి 2.45 గంటలకు వందలాది మంది పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఫుటేజీని తీసుకెళ్లారని ఆరోపించారు. పగటిపూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే విచారణకు రాలేరా? ఆయన ఉగ్రవాదినా? అని ప్రశ్నించారు. బీసీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్ర వైయస్ఆర్‌సీపీలో ఎదుగుతున్న బీసీ నాయకులను చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబానికి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, 18 ఏళ్ల యువకుడు బైక్ నడుపుతూ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కుట్రగా మార్చి అప్పలరాజును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చింతాడ రవికుమార్‌పైనా తప్పుడు కేసు అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో తనను కలిసేందుకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ ఆముదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై మహిళా ఎస్‌ఐపై దాడికి యత్నించారనే కేసు పెట్టారని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారిపై హత్యాయత్నం చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ముస్తఫా, కారుమూరు సునీల్‌నూ వదలడం లేదు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కూడా అక్రమంగా కిడ్నాప్ కేసు పెట్టారని తెలిపారు. పొగాకు కొనుగోలు కోసం డబ్బులు చెల్లించిన వ్యక్తి సరుకు ఇవ్వకపోయినా, డబ్బులు తిరిగి చెల్లించకపోయినా ముస్తఫాపైనే కేసు పెట్టారని పేర్కొన్నారు. ఏలూరు ఎంపీగా పోటీ చేసిన బీసీ నాయకుడు కారుమూరు సునీల్‌ను కూడా జిల్లా స్థాయి టెండర్ వ్యవహారంలో అక్రమంగా కేసులో ఇరికించారని తెలిపారు. నచ్చిన వారిపై కేసులు పెట్టడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, ఇష్టానుసారంగా అరెస్టులు చేయడం రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు. జైలులోనూ రాజకీయ కక్ష సాధింపు విరూపాక్షను పరామర్శించేందుకు తాను జైలుకు వెళ్లినప్పుడు తనను అవమానించేలా వ్యవహరించారని తెలిపారు. సాధారణంగా జైలుకు వచ్చే వారిని కూర్చోబెట్టి ఫొటోలు తీస్తారని, తనను మాత్రం గ్రిల్ బయట నిలబెట్టి ఫొటోలు తీశారని పేర్కొన్నారు. దీనిపై జైలు అధికారులను ప్రశ్నించగా, తనకు ప్రత్యేకంగా అలా చేయాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి దాడి చేయడం, బాధితుల ఫిర్యాదులు తీసుకోకపోవడం, వారిపైనే రివర్స్ కేసులు పెట్టడం, కుటుంబ సభ్యులను కేసుల్లోకి లాగడం, బీసీ నాయకులను వరుసగా లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వైయస్ఆర్‌సీపీ నాయకుడు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న ఈ తప్పుడు వ్యవస్థ శాశ్వతంగా ఉండదని, అధికారంలో ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని అన్నారు. ఇప్పుడు నాటుతున్న తప్పుడు రాజకీయాల విత్తనాలు భవిష్యత్‌లో అదే పాలకులకే చుట్టుకుంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పరిణామాలను గమనించి, న్యాయం, ధర్మం బతికేలా నిలబడాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.