భీమవరం: రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం సీట్లో చంద్రబాబు నాయుడు ఉంటే సిండికేట్లకు పండగ, రైతులకు మాత్రం కన్నీళ్లేనని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు కల్పించిన రక్షణ, గిట్టుబాటు ధర, రూపాయిన్నర విద్యుత్, APSADA వంటి సంస్కరణలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూటమి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. రైతుల ప్రభుత్వం తిరిగి వచ్చిన వెంటనే APSADAను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి, సిండికేట్ వ్యవస్థను అరికట్టి ఆక్వా రంగాన్ని మళ్లీ గాడిలో పెడతామని ఆయన భరోసా ఇచ్చారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు నష్టపోకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచాం. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.230 కంటే తక్కువ ధర రాకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాం. ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.275కు పెరిగింది. ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి. సీడ్ ధరలు పెరుగుతున్నాయి. కానీ పంట కొనుగోలు ధర మాత్రం రూ.230 దాటడం లేదు. ఒకవైపు ఖర్చులు పెరిగి, మరోవైపు అమ్మకపు ధర పెరగకపోతే రైతు ఎలా బతుకుతాడు? ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆక్వా రైతుల కోసం నిజంగా పనిచేసిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రూపాయిన్నరకే విద్యుత్ అందించిన ఘనత మా ప్రభుత్వానిది. 57 నెలల పాటు రూ.3,306 కోట్ల సబ్సిడీ భరిస్తూ రైతులకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆక్వా రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి వచ్చింది. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే రూపాయిన్నర విద్యుత్ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ఆ నాలుగు నెలల సబ్సిడీ కూడా చెల్లించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రూ.451 కోట్ల భారాన్ని కూడా మా ప్రభుత్వమే భరించింది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికుందో దీన్నిబట్టే అర్థమవుతుంది. మేనిఫెస్టోలో 5 వేల టన్నుల కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా అన్ని చెరువులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తగ్గిస్తామని, ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పైగా మేము అమలు చేసిన రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవో నెం.169 పేరుతో పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు పెట్టి రైతులపై అదనపు భారం మోపుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. ప్రస్తుతం 12 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్రీ-ఫేజ్ విద్యుత్ ఇవ్వాల్సిన చోట సింగిల్-ఫేజ్ సరఫరా చేస్తూ రైతులను జనరేటర్లపై ఆధారపడే పరిస్థితికి నెట్టేశారు. మా ప్రభుత్వ హయాంలో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. 782 ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించి రైతులకు శాస్త్రీయ సేవలు అందించాం. ఇప్పుడు నాణ్యత పర్యవేక్షణ పూర్తిగా బలహీనపడింది. నరసాపురంలో ప్రారంభించిన ఫిషరీస్ యూనివర్సిటీని కూడా నిలిపివేశారు. మెడికల్ కాలేజీ పనులు కూడా ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులుగా ఉన్న చేపలు, రొయ్యల ఉత్పత్తిని మా ప్రభుత్వం 51 లక్షల టన్నులకు పెంచింది. ఆక్వా ఎగుమతుల విలువను రూ.13,855 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు చేర్చాం. యాంటీబయోటిక్ అవశేషాలను 86 శాతం నుంచి 20 శాతం లోపే తగ్గించగలిగాం. అందుకే రాష్ట్రానికి వరుసగా బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు వచ్చాయి. మీ కష్టాలు నాకు తెలుసు. నేను మీతోనే ఉన్నాను. మళ్లీ రైతుల ప్రభుత్వం వస్తుంది. APSADAను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తాం. రైతులను దోచుకుంటున్న సిండికేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం. అంతవరకు ఆక్వా రైతుల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి రైతన్నకు మా పార్టీ అండగా ఉంటుంది. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేకంగా కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు రైతులు నష్టపోకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచాం. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.230 కంటే తక్కువ ధర రాకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాం. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.275కు పెరిగింది. ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి. సీడ్ ధరలు పెరుగుతున్నాయి. కానీ పంట కొనుగోలు ధర మాత్రం ఇప్పటికీ కిలోకు రూ.230 దాటడం లేదు. ఒకవైపు ఖర్చులు పెరుగుతుంటే, మరోవైపు అమ్మకపు ధర పెరగకపోతే రైతు ఎలా బతుకుతాడు? ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆక్వా రైతుల కోసం నిజంగా పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనిట్‌కు రూపాయిన్నరకే విద్యుత్ అందించిన ఘనత మా ప్రభుత్వానిదే. 57 నెలల పాటు రూ.3,306 కోట్ల సబ్సిడీ భరిస్తూ రైతులకు అండగా నిలిచాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆక్వా రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి వచ్చేది. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే రూపాయిన్నర విద్యుత్ ఇస్తానని ప్రకటించి జీవో జారీ చేశారు. కానీ ఆ నాలుగు నెలల సబ్సిడీ కూడా చెల్లించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రూ.451 కోట్ల భారాన్ని కూడా మా ప్రభుత్వమే భరించింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. 5 వేల టన్నుల కోల్డ్ స్టోరేజీలు, విద్యుత్ సబ్సిడీ, ట్రాన్స్‌ఫార్మర్ల ధరల తగ్గింపు, ఏరియేటర్లకు సబ్సిడీ... ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు జీవో నెం.169 పేరుతో పవర్ ఫ్యాక్టర్ నిబంధనలు పెట్టి రైతులపై అదనపు భారం మోపుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే 12 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్రీ-ఫేజ్ విద్యుత్ ఇవ్వాల్సిన చోట సింగిల్-ఫేజ్ సరఫరా చేస్తూ రైతులను జనరేటర్లపై ఆధారపడే పరిస్థితికి నెట్టేశారు. మా ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన సీడ్, ఫీడ్, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. 782 ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించి రైతులకు శాస్త్రీయ సేవలు అందించాం. రైతులకు చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థను తీసుకొచ్చాం. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో 120 నుంచి 150 రోజుల వరకు బతికే సీడ్ ఇప్పుడు 90 రోజులు కూడా నిలవడం లేదు. వ్యాధులు పెరిగిపోయాయి. నాణ్యత పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతింది. నరసాపురంలో మా ప్రభుత్వం ప్రారంభించిన ఫిషరీస్ యూనివర్సిటీని నిలిపివేశారు. అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ పనులను కూడా ఆపేశారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మా పాలనలో నిరూపించాం. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో, ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మా పాలనలో నిరూపించాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అది 51 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు చేయూతనిస్తూ, శాస్త్రీయ విధానాలను అమలు చేస్తూ, నాణ్యతను మెరుగుపరచడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. 2018–19లో రూ.13,855 కోట్లుగా ఉన్న ఆక్వా ఎగుమతుల విలువ మా ప్రభుత్వ హయాంలో రూ.20 వేల కోట్లకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాంటీబయోటిక్ అవశేషాల శాతం 86 శాతం వరకు ఉండేది. మా ప్రభుత్వం శాస్త్రీయ పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ చర్యలతో దాన్ని 20 శాతం లోపే తగ్గించగలిగింది. అందుకే ఎగుమతులు పెరిగాయి. రైతులకు మంచి మార్కెట్ లభించింది. ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది. 2021–22, 2023–24 సంవత్సరాల్లో వరుసగా బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ అందుకోవడం కూడా మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మనసున్న ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఎలా దిగజారుతుందో ఈ రెండు ప్రభుత్వాల పనితీరే చెబుతోంది. మీ కష్టాలు నాకు తెలుసు. నేను మీతోనే ఉన్నాను. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాది పూర్తయిన తర్వాత మళ్లీ రైతుల ప్రభుత్వం వస్తుంది. మళ్లీ APSADAను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తాం. ముఖ్యమంత్రి స్వయంగా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రైతులను దోచుకుంటున్న సిండికేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం. అంతవరకు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తాం. ఆక్వా రైతుల సమస్యలపై, రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి కష్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. ఇక్కడ నా పక్కనే పొగాకు రైతులు కూడా ఉన్నారు. వరుసగా రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేక వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పొగాకు రైతులే కాదు... రాష్ట్రంలో ఏ పంట చూసినా రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి కనిపిస్తోంది. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమయ్యాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయింది. సమయానికి అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ కనిపించడం లేదు. రైతు భరోసా కూడా ఆశించిన విధంగా అందడం లేదు. ఈ బాధాకర పరిస్థితుల్లో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రైతుల హక్కుల కోసం, రైతుల జీవనోపాధి కోసం, ప్రతి సమస్యపై మేము ఉద్యమిస్తాం. రైతాంగానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, అభిమానానికి మరోసారి రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.