ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అనంత వెంకటరామిరెడ్డి

అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగకుండా నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించాలి

అధికారులకు సూచన

 అనంతపురం: అనంతపురం నగరంలోని 2వ రోడ్డులో ఉన్న 65వ సచివాలయంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను అనంతపురం జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ నమోదు ఎంత శాతం పూర్తయిందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మరింత అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ "మన ఓటు–మన హక్కు" అనే భావనతో నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ కార్పొరేటర్ టీవీ చంద్రమోహన్ రెడ్డి, స్థానిక నాయకులు వెంకటసుబ్బారావు, మోహన్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top