పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా? 

రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైయ‌స్ జగన్ ఆగ్రహం

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రాథ‌మిక హక్కుల‌కు భంగం కలుగుతోంది

పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు

వేధింపులు ఎదురైనా సరే ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటాం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జగ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రాశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ శనివారం తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిరసనలు తెలియజేడం, సమావేశాలు నిర్వహించుకోవడం.. బలమైన పునాదులు. అలాంటిది పునాదులను ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసే ప్రయత్నంలో ఉందని వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.  

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..

  • పోలీసులు, మీడియా యంత్రాంగాలను ఉపయోగించి ప్రశ్నించే గొంతులను చంద్రబాబు ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తోంది. ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి, సమావేశం కావడానికి ఉన్న హక్కులు ప్రజాస్వామ్యానికి పునాదులు. ఇవి ప్రజలకు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, ప్రభుత్వాలకు తమ బాధ్యతను గుర్తు చేయడానికి ఉన్నాయి. అయితే ఏపీలో అలాంటి వాటిని చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. 
  • ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి
  • అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాధమిక హక్కులు భంగం కలుగుతోంది
  • చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది
  • పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు
  • పోలీసు రాజ్యమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్టుగా మారింది
  • చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా.. అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది
  • ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి
  • ప్రతిపక్షం, ప్రజలు, నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులుమేస్తున్నారు
  • పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని నియంతృత్వ పాలనతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షం చట్టబద్ధమైన సమస్యలను లేవనెత్తిన ప్రతిసారీ.. నిర్బంధం, వేధింపులు, తప్పుడు కేసులు కనిపిస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్‌ పర్యటన నుంచి బంగారుపాళ్యం పర్యటన.. దాకా ప్రతీసారి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారాయన.  
  • గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదు చేశారు
  • రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు
  • పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారు
  • పల్నాడులో పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు
  • 131 మందికి నోటీసులు జారీ చేశారు, సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు
  • తప్పుడు కేసులు, అరెస్టులు, మీడియా అసత్య కథనాలతో చంద్రబాబు ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ, వేధింపులు ఎదురైనా సరే రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటాం అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
Back to Top