సింగపూర్ కాన్సుల్ జనరల్‌తో వైయస్ జగన్ భేటీ 

తాడేపల్లి : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్ మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరు నాయకులు పరస్పర ఆసక్తికర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్‌ను వైయస్ జగన్ ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు.
 

Back to Top