ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వైయ‌స్ జగన్‌ పర్యటన

 అంపోలు జిల్లా జైలులో మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి (30.07.2026, గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజును ఆయన ములాఖత్‌ ద్వారా కలుసుకుని పరామర్శించనున్నారు.

డాక్టర్‌ సీదిరి అప్పలరాజును పరామర్శించి, ఆయనకు, కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించనున్నారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకు శ్రీ వైయ‌స్ జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.

Back to Top