తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలి

రాయ‌దుర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా

రాయదుర్గం: రాయదుర్గం నియోజకవర్గ రైతులకు తుంగభద్ర జలాశయం నుంచి సకాలంలో సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. పంటలకు నీరే ప్రాణాధారమని, సకాలంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.
రాయదుర్గం ప్రాంత రైతుల సాగునీటి హక్కు కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. రైతుల పొలాలకు సాగునీరు అందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top