విద్యార్థులు, తల్లిదండ్రులు, వైయ‌స్ఆర్‌సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం

మారికవలస గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగిస్తామని అధికారుల హామీ

అల్లూరి జిల్లా: విద్యార్థులు, తల్లిదండ్రులు, వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన పోరాటంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలస గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని అధికారులు నిర్ణయించి, విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మారికవలస గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వారి పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.

అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేస్తూ పోరాటాన్ని కొనసాగించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం స్పందించి మారికవలస గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్చరించారు.

Back to Top