నర్సీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వైయస్ జగన్ ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలోని ముఖ్య నాయకులతో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రత్యేక నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజలతో నిరంతర సంబంధాలు, సమర్థులైన అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పెట్ల ఉమా శంకర్ గణేష్ సూచించారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణను మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.