వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ, బీఎస్పీ నేతలు

నెల్లూరు జిల్లా : గూడూరు నియోజకవర్గంలో టీడీపీ, బీఎస్పీకి చెందిన పలువురు నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. గూడూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ బూదూరు గురవయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు.
గూడూరు టౌన్‌ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు, బీఎస్పీ గూడూరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ గిద్దలూరు రఘు, మైనారిటీ నాయకులు ఎస్‌.కె. కరీముల్లా, ఎస్‌.కె.ఎస్‌. ధాని, మహేష్‌, కిరణ్‌కుమార్‌, టీ. కిరణ్‌బాబు తదితరులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, యల్లా శ్రీనివాసులురెడ్డి, ఇందుకూరు జనార్దన్‌రెడ్డి, మనుబోలు కిష్టయ్య, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన నాయకులకు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు స్వాగతం పలికాయి.
 

Back to Top