ఘ‌నంగా విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి వేడుక‌లు

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌, గాయత్రీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్లు ఎస్‌.ఎం. పవిత్ర, తోలేటి శ్రీకాంత్‌, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎస్‌.డి. మురళీకృష్ణ, కె. గురవాచారి, ఉదయ్‌కుమార్‌, శేఖర్‌తో పాటు వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. “అపార నైపుణ్యానికి ప్రతీకగా, సృజనాత్మకతకు ప్రతిరూపంగా, శ్రమకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన శ్రీ విరాట్‌ విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు.

Back to Top