కొత్తపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తిస్తూ బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, మండల పార్టీ బాధ్యులకు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఐడెంటిటీ కార్డులు అందజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, రాజకీయ పరిణామాలను ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రానున్న రోజుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించారు.