ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు రాక్షసకాండ

 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యే తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

కర్నూలు: ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి 48 రోజుల పాటు జైలులో ఉంచారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు పూర్తికాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పును ఈ నెల 18వ తేదీకి రిజర్వ్ చేసింది.

 మరింత బలంగా నిలబడతాం

అక్రమ కేసులు, అరెస్టులతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టలేరని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు తీరుకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు మరింత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం కొనసాగిస్తారని తెలిపారు.
 

Back to Top