వైయ‌స్ఆర్‌సీపీ నుంచి మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ నుంచి మరో నేతపై సస్పెన్షన్ వేటు పడింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ విధానాలకు విరుద్ధంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సిఫార్స్ మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఇకపై మోపిదేవి శ్రీనివాసరావుకు వైయ‌స్ఆర్‌సీపీతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.
 

Back to Top