తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రేపు (17.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్ధితులపై జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై సీనియర్ నాయకులతో శ్రీ వైయస్ జగన్ చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు.