విజయనగరం : వైయస్ఆర్‌సీపీ విజయనగరం జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)ను గజపతినగరం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య ఘనంగా సత్కరించారు. విజయనగరంలోని దాసన్నపేట వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బెల్లాన చంద్రశేఖర్‌కు గజపతినగరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స అప్పలనరసయ్య శాలువాతో బెల్లాన చంద్రశేఖర్‌ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టిన బెల్లాన చంద్రశేఖర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తను కలుపుకొని, అందరి సూచనలు, సలహాలతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ బెల్లాన చంద్రశేఖర్‌కు జిల్లా అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకత్వానికి అండగా ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.