స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి

 పగిడ్యాలలో మండల స్థాయి విస్తృత సమావేశంలో డాక్టర్ ధార సుధీర్

నంద్యాల జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ నేతృత్వంలో, పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుల్యాల నాగిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

డాక్టర్ ధార సుధీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు. వార్డు సభ్యుడి స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తింపు కార్డులను నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పగిడ్యాల మండల స్థాయి నాయకులు, గ్రామాల ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top