వైయస్ఆర్ జిల్లా: డాక్టర్ వైయస్. సత్యానందరెడ్డి గారి పార్థివదేహానికి కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, నాయకులు వైయస్ మనోహర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యానందరెడ్డి మృతి పట్ల నాయకులు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.