వైయస్. జగన్ చేసిన భూ సంస్కరణల జీవోలను దాచేసిన కూటమి ప్రభుత్వం

ఇప్పుడు తానే చేశానంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీ:

అగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి.

హామీల ఎగవేత.. పక్కా పథకం ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాల కోత:

కుట్రలు, మోసాలకు చంద్రబాబు సామ్రాట్:

హామీల ఎగవేత.. పేదల హక్కుల కాలరాతే :

పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములపై బట్టబయలౌమ చంద్రబాబు అబద్ధాలు

తేల్చి చెప్పిన గడికోట శ్రీకాంత్ రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేస్తూ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ ఫలాల క్రెడిట్‌ను నిర్లజ్జగా చోరీ చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 30 లక్షల మంది మహిళలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చి, 20 లక్షలకు పైగా పక్కా గృహాలను నిర్మించడమే కాకుండా, విప్లవాత్మక నిర్ణయాలతో 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై అసలు అసైనీలకే పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవో ఎంఎస్ 596 తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దాదాపు 15.21 లక్షల మంది నిరుపేద రైతులకు చెందిన 27.41 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి, వివిధ నిషేధిత జాబితాల నుంచి 35.44 లక్షల ఎకరాలను విముక్తి కల్పించి, గిరిజనులకు డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా వేలాది ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అయితే తన రెండున్నరేళ్ల పాలనలో పేదలకు ఒక్క గజం నివాస స్థలం కూడా ఇవ్వకుండా, ఏ కొత్త సంస్కరణలు చేపట్టకుండా చేతులెత్తేసిన చంద్రబాబు.. ఎన్నికల ముందు అసైన్డ్ భూములపై విషప్రచారం చేసి ఆ జీవోలను గల్లాపెట్టెలో పెట్టి తాళాలు వేశారని మండిపడ్డారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోల తాళాలు తీసి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు దక్కిన ఫ్రీహోల్డ్, డీకేటీ, గృహ నిర్మాణ పథకాల ప్రయోజనాలన్నింటినీ తానే చేసినట్లు డబ్బా కొట్టుకుంటూ అబద్ధాలతో ప్రచారం చేసుకోవడం పచ్చి మోసమని ఆయన మండి పడ్డారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

కుట్రలకు, మోసాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్..

ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారుడు, మోసగాడు మరొకరు ఉండరు. చంద్రబాబు మోసాలకు, అవినీతికి అసలైన సామ్రాట్. పదేపదే కేస్ స్టడీస్ అంటూ మాట్లాడే చంద్రబాబు, ప్రజలను ఎలా దగా చేయవచ్చో తానే ఒక కేస్ స్టడీగా మారిపోయారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నికల ప్రచారంలో మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని ఊపుతూ ఓట్లు అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబే. యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తామని కోట్లాది మందిని మోసం చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్లీ దరఖాస్తులంటూ కొత్త డ్రామాలకు తెరతీశారు.

6.30 లక్షల పెన్షన్లు పీకేసి.. మళ్లీ పచ్చి మోసం..

వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ముగిసే నాటికి రాష్ట్రంలో 66 లక్షల 34 వేల మందికి ప్రతినెలా ఒకటో తేదీనే గౌరవప్రదంగా ఇంటి వద్దకే పెన్షన్ అందించాం. ఐదేళ్లలో సంతృప్త స్థాయిలో 29.50 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్ల సంఖ్యను 59 లక్షల 80 వేలకు కుదించారు. ఏకంగా 6 లక్షల 30 వేల పెన్షన్లను కక్షపూరితంగా తొలగించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, అర్హత పత్రాల కోసం వికలాంగులను, వృద్ధులను ఆఫీసుల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారు. అర్హులైన వారికి గత 30 నెలల బకాయిల మొత్తం దాదాపు రూ.1.20 లక్షలు వెంటనే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీని పాత బకాయిలతో సహా అమలు చేయాలి.

పేదల గృహ నిర్మాణంలో చంద్రబాబుది శూన్య హస్తం..

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగక మునుపే ఏకంగా 30 లక్షల మంది పేద మహిళలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 20 లక్షలకు పైగా పక్కా గృహాలు మంజూరు చేసి చిన్నపాటి ఊళ్లనే సరికొత్తగా నిర్మించారు. కానీ ఈ రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త ఇల్లు మంజూరు చేయలేదు, ఒక్క కాలనీ కట్టలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకే అరాకొర బిల్లులు ఇచ్చి, కేంద్రం ఇచ్చిన నిధులతో తామేదో ఇళ్లు కట్టిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామంటూ మళ్లీ దగాకోరు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ క్రెడిట్ వైయస్. జగన్ దే..

పేదలకు భూములపై శాశ్వత యజమాని హక్కులు కల్పించాలనే సంకల్పంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 2న జీవో ఎంఎస్ 55, ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో జీవో ఎంఎస్ 596 తీసుకొచ్చింది. 13 మంది ఎస్సీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన కమిటీ ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. అసలు అసైనీలకు, వారి చట్టబద్ధ వారసులకే 20 ఏళ్లు నిండిన అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు దక్కేలా అత్యంత పకడ్బందీగా చట్టం రూపొందించాం. 15.21 లక్షల మంది రైతులకు చెందిన 27.41 లక్షల ఎకరాలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియ మొదలుపెడితే, చంద్రబాబు ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసి, ఆ జీవోలను అధికారంలోకి రాగానే గల్లాపెట్టెలో పెట్టి తాళాలు వేశారు.

నిషేధిత జాబితా నుంచి రికార్డు స్థాయిలో భూముల విముక్తి..

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రికార్డు స్థాయిలో వివిధ నిషేధిత జాబితాల నుంచి 35.44 లక్షల ఎకరాలను విముక్తి చేసి 20.24 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చాం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 2.60 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యను పరిష్కరించి 1.07 లక్షల మందికి ఊరట నిచ్చాం. సర్వీస్ ఇనాం భూముల్లో రజకులు, నాయీబ్రాహ్మణులు, కుమ్మరులు, కమ్మరులు తదితర సాంప్రదాయ వృత్తిదారులకు చెందిన 1,61,784 ఎకరాలపై ఆక్షేపణలు తొలగించి 1,58,113 మందికి లబ్ధి చేకూర్చాం. షరతులతో కూడిన పట్టా భూముల్లో 33,494 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి 22,042 మంది రైతులకు ప్రయోజనం కల్పించాం. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా దళితులకు ఇచ్చిన భూములపై ఉన్న పరిమితుల సమస్యల్లో 22,537 ఎకరాలపై ఆక్షేపణలు తొలగించి 22,340 మందికి హక్కులు కల్పించాం. కృష్ణా–గోదావరి లంక ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు 9,064 ఎకరాలకు పట్టాలు ఇచ్చి 17,000 మందికి ప్రయోజనం కల్పించాం. గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం కింద 2,87,710 ఎకరాలు సుమారు 1,30,000 మందికి, అదనంగా డీకేటీ కింద 39,272 ఎకరాలు 26,000 మందికి అందించాం.

ఇన్ని భూ సంస్కరణలు చేసి పేదలు, రైతులకు హక్కులు కల్పించిన గత ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో ఆరోపణలు చేసిన వారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆరోపణనైనా నిరూపించారా? ప్రజలను మభ్యపెట్టే రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవ లెక్కలతో మాట్లాడాలి.

ఈ నేపధ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పేదల సంక్షేమం, భూ హక్కుల కోసం తెచ్చిన చారిత్రక రికార్డులు, జీవోలు అన్నీ స్పష్టంగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందు ఉంచాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా అర్హులైన వారికి నిలిపివేసిన పెన్షన్ల బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు, అసైన్డ్, డీకేటీ, ఇళ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన మేలును అడ్డుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలను మభ్యపెట్టే కుట్రలు, క్రెడిట్ చోరీ రాజకీయాలను ఇప్పటికైనా విడనాడి, పేదల హక్కులను గౌరవించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
 

Back to Top