ఆళ్ల నానికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఘన నివాళి

   ఏలూరులోని నాని నివాసానికి చేరుకుని పార్థివదేహానికి శ్రద్ధాంజలి

ఏలూరు: మాజీ ఉప ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)కు వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ఘన నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరులోని నాని నివాసానికి చేరుకున్న పార్టీ నాయకులు ఆయన పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జయప్రకాష్‌, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి వడ్డి రఘురాం, చింతలపూడి ఇన్‌చార్జి కంభం విజయరాజు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు తదితరులు నానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో ఆళ్ల నాని అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మృతి వైయ‌స్ఆర్‌సీపీకి, ఏలూరు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
 

Back to Top