తాడిపత్రిలో టీడీపీ వర్గీయుల దాష్టీకం

  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద వాహనం ధ్వంసం

 అనంతపురం: తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బొలేరో వాహనంలో వచ్చి పెద్దారెడ్డి కాన్వాయ్‌కు చెందిన స్కార్పియో వాహనం అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వాహనం ధ్వంసానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించి, ఘటనకు బాధ్యులపై వివరాలు సేకరిస్తున్నారు.

Back to Top