ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి 

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 వైయ‌స్ఆర్ జిల్లా: సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వినడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తోందని, పని ఒత్తిడి తగ్గించాలని, జీవో 11ను రద్దు చేయాలని, 9 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు.

మెటర్నిటీ సెలవులు కల్పించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాచమల్లు కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఒత్తిడితో 400 మంది సచివాలయ ఉద్యోగులు మరణించారని ఆయన పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థను వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, ఆయన పాలనలో 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైయ‌స్‌ జగన్‌కే దక్కుతుందని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తే వారిని ‘బ్లెడ్‌ బ్యాచ్‌’గా అభివర్ణించిన టీవీ5 యాంకర్‌ సాంబశివరావు వ్యాఖ్యలను కూడా రాచమల్లు తప్పుబట్టారు. ఉద్యోగుల సమస్యలను అవమానించేలా కాకుండా వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Back to Top