కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం త‌గ‌దు

వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

 కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ సిరికి ఆయన వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ శాఖలో సర్వర్‌ సమస్య పేరుతో ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఎన్నికలకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఏర్పడిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం కూడా కొనసాగిస్తోందని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వర్‌ సమస్యను సాకుగా చూపకుండా పెండింగ్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top