కాకుమాను రాజశేఖర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల నివాళి

ఒంగోలులో రాజశేఖర్ జ్ఞాప‌కార్థ కూడిక‌

 ఒంగోలు:  మాజీ లిడ్ క్యాప్ చైర్మ‌న్‌,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌ర్గీయ కాకుమాను రాజ‌శేఖ‌ర్ చిత్ర‌ప‌టానికి పార్టీ నేత‌లు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  ఒంగోలు నగరంలోని స్వర్గీయ  కాకుమాను రాజశేఖర్‌ నివాసం వద్ద ఆయ‌న జ్ఞాప‌కార్థ కూడిక ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,  ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి  చుండూరి రవిబాబు,  త‌దిత‌రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్  సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొని రాజశేఖర్‌కు నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.

Back to Top