తాడేపల్లి: నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ కష్టకాలంలోనూ విధేయంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ అధినేత జగన్‌గారి స్పష్టమైన నిర్ణయమని వారు తెలిపారు. ఓసీ జనరల్ రిజర్వేషన్ వస్తే విజయమే లక్ష్యంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆయన సూచించారని చెప్పారు. ఒకవేళ రిజర్వేషన్ అయినా కూడా, బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: కష్టకాలంలో అండగా నిలిచిన వారికే పార్టీలో ప్రాధాన్యత:కాకాణి గోవర్ధన్‌రెడ్డి. మాజీ మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి ఎంపికపై మా నాయకుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మేము కలిశాం. ఓసీ జనరల్ అభ్యర్థిగా అవకాశం వస్తే విజయమే లక్ష్యంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆయన సూచించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచినవారికి, పార్టీకి విధేయంగా పని చేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టంగా చెప్పారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ వరకు, వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వాలన్నదే ఆయన సూచన. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నెల్లూరులో బలంగా ఎదుర్కొంటాం: ఎన్నికల రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు చేస్తారేమో వేచి చూడాల్సి ఉంది. ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు ఇవ్వకుండా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బలమైన నాయకులపై పీడీ యాక్ట్, రౌడీషీట్లు, అక్రమ కేసులు పెట్టి ఎన్నికల నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ బలమైన ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగుతుంది. ఆనం కుటుంబానికి నెల్లూరు నగరపాలక సంస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి గతంలో కీలక పదవులు నిర్వహించారు. ఆయన కుటుంబం స్థానిక సంస్థల్లో ప్రజలకు సేవ చేస్తూ వచ్చింది. విజయ్‌కుమార్‌రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం సముచిత నిర్ణయం. ఈ అవకాశం కల్పించిన జగన్‌గారికి పార్టీ శ్రేణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 72 డివిజన్ల నెల్లూరు కార్పొరేషన్‌కు మేయర్ పదవి కీలకం: :పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నెల్లూరు నగరంలో 72 డివిజన్లు ఉన్నాయి. ఇలాంటి కీలకమైన కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఉండాలి. పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశాలు ఇవ్వాలని శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సూచించారు. అందులో భాగంగానే ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి అవకాశం కల్పించారు. సిటీ, రూరల్‌ను సమన్వయం చేసుకుని విజయం కోసం కృషి: ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడగలిగే నాయకుడు. నెల్లూరులోని వ్యాపారులు, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తి. ఆయన మేయర్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అవకాశం కల్పించిన వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు: ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి. 72 డివిజన్లు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా, ఓసీ జనరల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో సంప్రదింపుల అనంతరం నాకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు.