ప్రతి పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలి

: టీఎన్‌ దీపిక

 హిందూపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి టీఎన్‌ దీపిక పిలుపునిచ్చారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని విరాట్‌ ప్యాలెస్‌లో మండల విస్తృత సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేలా సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన గుర్తింపు కార్డులను నాయకులు, కార్యకర్తలకు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, బూత్‌ కమిటీల జోన్‌–5 ఇన్‌చార్జి సురేష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఆన్సర్‌, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రమేష్‌, జిల్లా ఎస్సీ సెల్‌ నాయకులు చిన్నప్పయ్య, జిల్లా కార్యదర్శి కోడూరు గిరిధర్‌రాజు, మాజీ సర్పంచ్‌ సంధ్యతో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పంచాయతీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Back to Top