నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత

పోలీసుల ఆంక్షలతో రోడ్డుపైనే సర్వసభ్య సమావేశం

నంద్యాల: నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డెయిరీలో జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా చైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయట రోడ్డుపైనే సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆంక్షలపై డెయిరీ పాలకవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పోలీసులకు ఏదైనా అభ్యంతరం ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి తెలియజేయాల్సిందని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికే మూడుసార్లు పోలీసులను అడ్డుపెట్టి సమావేశాలు జరగకుండా చేశారని వారు తెలిపారు. నష్టాల్లో ఉన్న విజయ పాల డెయిరీని లాభాల్లోకి తీసుకువచ్చి పాడి రైతులకు బోనస్‌లు అందిస్తూ అండగా నిలుస్తున్న సమయంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే విధంగా డెయిరీ పరిపాలన కొనసాగుతుంటే స్వలాభం కోసం డెయిరీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Back to Top