ఇందుకేనా ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీ?

 మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నేతలపై చర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు

 అనంతపురం: వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబ సభ్యులపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా నేతలు కోరారు. ఈ మేరకు అనంతపురం రెండో పట్టణ సీఐ పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, నగర అధ్యక్షుడు గోళ్ల శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, “సభలు, సమావేశాల్లో మహిళల పట్ల కపట ప్రేమ చూపించే కూటమి నేతలు, సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వ్యక్తిగత దూషణలు చేయడానికే ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీ తీసుకొచ్చారా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అన్నారు. ప్రజా వ్యవస్థలో మార్పు మొదలైంది. స్థానిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు” అని షేక్ బాబా సలామ్ అన్నారు.

Back to Top