కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్నారు

వైయస్ జగన్ కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్.

జనసేన సైకోల అసభ్య వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు మౌనం ఎందుకు?

ఆ వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మిణి గార్లకు పంపిస్తాం.. 

అవి సరైనవేనా మీరే  చెప్పండి.. 

సూటిగా ప్రశ్నించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీ రామచందర్రావు ను కలిసి విశాఖపట్నం వైఎస్ఆర్సిపి నేతలు.

డీసీపీకి వినతి పత్రం సమర్పించిన వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వైయస్సార్సీపీ నేతలు దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, కోల గురువులు, పేడాడ రమణీ కుమారి.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ నేతలు. 

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం వైయస్సార్సీపీ నేతలు  డీసీపీ రామచంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, వైయస్సార్సీపీ నేతలు పేడాడ రమణీ కుమారి, సతీష్ రెడ్డి, కోల గురువులు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాల్లో తమ పార్టీ అధినేత ఆదేశాల మేరకు వైయస్సార్సీపీ ఎంతో హుందాగా వ్యవహరించిందని గుర్తుచేస్తూ, నేడు తమ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు ఏ సమాధానం చెబుతారని నిలదీశారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఎవరేమన్నారంటే...

కొందరు పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా మారారు
– కేకే రాజు, వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు

కూటమి నేతలు రాష్ట్రంలో రాజకీయ విలువలను అధఃపాతాళానికి తొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంలో ఎవరూ మాట్లాడవద్దని మా అధినేత వైయస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఆ విషయంలో వైయస్సార్సీపీ ఎంతో హుందాగా వ్యవహరించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్ గారు ఎప్పుడూ చెబుతారు. కానీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మాత్రం మాజీ సీఎం జగన్ గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్.జగన్ ని రాజకీయంగా ఏమీ చేయలేక ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగినందుకు, సచివాలయ ఉద్యోగులు తమ ఇంక్రిమెంట్లు, హక్కుల గురించి, విద్యార్థులు ఫీజు బకాయిల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కూటమి నేతలు తమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో దుష్ప్రచారం చేయిస్తూ, పోలీసుల ద్వారా పీడీ యాక్టులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నారు. కానీ, రెండు రోజుల క్రితం వైయస్ జగన్ కుటుంబ సభ్యులపై ప్రపంచవ్యాప్తంగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు జరిగి, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా పోలీసుల దృష్టికి రాకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రజలకు జవాబుదారీగా, చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసు యంత్రాంగంలో కొంతమంది అధికారులు నేడు అధికార పార్టీ నాయకులకు బానిసలుగా పనిచేస్తున్నారు. తక్షణమే ఆ దుశ్చర్యకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.

పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ దిగజారుడు వ్యాఖ్యలు
వరుదు కళ్యాణి, వైయస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు

మొన్న అర్ధరాత్రి మద్యం, గంజాయి మత్తులో ట్విట్టర్ స్పేస్‌లో జనసేన సైకోలు జగనన్న గురించి, ఆయన తల్లి, భార్య, చెల్లెలి గురించి నోటితో చెప్పలేనంత దారుణంగా, పశువుల కంటే హీనంగా మాట్లాడారు. అసలు వాళ్లు తల్లి కడుపున పుట్టారా అని అనిపిస్తోంది. ఆ వీడియోలను మీ ఇంట్లో మీ అమ్మకు, భార్యకు, అక్కచెల్లెళ్లకు చూపించండి, వాళ్లే మీ మొహం మీద ఉమ్మేస్తారు. ఏ రోజైనా భారతమ్మ గారు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడారా? అలాంటి వారిపై ఇంత నీచంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మీరు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారా? ఆ వీడియోలను మేము భువనేశ్వరి గారికి, బ్రాహ్మిణి గారికి పంపిస్తాము. మీ భర్తలను మీరే అడగండి.. మహిళల గురించి ఇలా మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించండి.
మున్సిపల్ ఎన్నికల్లో అరాచకం సృష్టించడం, సీఐఐ (CII) సమ్మిట్‌లో పెట్టుబడులు రాకపోవడం వంటి అన్ని రకాల ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జనసేన సైకోలతో ఇలా మాట్లాడిస్తున్నారు. మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు గారు, తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధినేత సపోర్ట్ ఉండబట్టే కదా వీళ్లు ఇంతలా రెచ్చిపోయింది. మా కార్యకర్తలు కేక్ కట్ చేస్తే బేడీలు వేసి నడిపించిన హోం మంత్రి అనిత గారు, ఒక మహిళ అయి ఉండి ఇంత దారుణం జరుగుతుంటే ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు. ఆమె తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. వైయస్సార్సీపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టడానికి సుమోటోగా స్పందించే మహిళా కమిషన్ ఇప్పుడు నిద్రపోతోందా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ముక్కలు ముక్కలు చేసి కాకులకు, గద్దలకు వేయాలన్నంత ఆగ్రహం రాష్ట్ర మహిళల్లో వ్యక్తమవుతోంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Back to Top