రాష్ట్ర ప్రచార విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం

పరిసపోగు శ్రీనివాసరావుకు మైల రత్నకుమారి అభినందనలు

గుంటూరు: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమితులైన పరిసపోగు శ్రీనివాసరావును వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం జోన్‌-3 అధ్యక్షురాలు మైల రత్నకుమారి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రచార విభాగం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడంలో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రచార విభాగం ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వైయ‌స్‌ జగన్‌ చేసిన సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా పనిచేస్తామని మైల రత్నకుమారి తెలిపారు. జోన్‌-3తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార విభాగాన్ని మరింత చురుకుగా, శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసేలా ప్రచార విభాగాన్ని మరింత క్రియాశీలం చేస్తామని ర‌త్న‌కుమారి తెలిపారు.

Back to Top