ఒంగోలు చేరుకున్న వైఎస్‌ జగన్‌

  కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత

 ఒంగోలు : వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఇటీవల డీఎస్సీ వ్యవహారంపై వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన సందర్భంగా శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన పోలీసుల తోపులాటలో కాకుమాను రాజశేఖర్‌ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సాక్షి కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. 
 

Back to Top