కల్మషం లేని వ్యక్తి  ఇమామ్

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి: క‌ల్మ‌షం లేని వ్య‌క్తి ఇమామ్ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు.  పద్మావతి పురంలోని పార్టీ కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కే.రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యము, రాయలసీమ మేధావులు ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్‌. ‘వైఎస్సార్‌ బాటలో జగన్‌ నడుస్తున్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడుతో వైయ‌స్‌ జగన్‌.. స్కూళ్ల రూపురేఖలు మర్చారు. వైయ‌స్‌ జగన్‌ ఒక సంఘ సంస్కర్తగా అడుగులేశారు. ఇమామ్‌ ఆశీస్సులు వైయ‌స్‌ జగన్‌కు ఉండాలి

ఇమామ్ 77 ఏళ్ల వయసులో నవ యువకుడిగా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉన్నారు. ఏ కల్మషం లేని వ్యక్తి  ఇమామ్.. ఆయన దారిలో పయనించాలి. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకు నడిచారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో వైయ‌స్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేది. ఏ సీఎం  కూడా చేయని విధంగా దేశంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది ఒక్క వైఎస్‌ జగన్‌ మాత్రమే. ప్రజలకు గుర్తుండి పోయేలా వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.

ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇమామ్ కదలిక ద్వారా ఎన్నో సమాజంలో ఎన్నో సంస్కరణలకు కారణం అయ్యారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమామ్ పనిచేశారు.. కృషి చేశారు. 

భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇమామ్‌తో సుదీర్ఘ పరిచయం.. 21 నెలలు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతో మెలగటం
 

Back to Top