ముద్రగడ పద్మనాభంకు సజ్జల రామకృష్ణారెడ్డి ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్‌: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారిని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌లో పరామర్శించారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం గారిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ ముద్రగడ గిరిబాబు, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని వారికి భరోసా కల్పించారు. ముద్రగడ పద్మనాభం గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు.

Back to Top