డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల 

తాడేప‌ల్లి: ఏపీలో డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాలపై తలెత్తిన ఆరోపణలకు లోకేష్ బాధ్యత వహించాలన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత ఎవరిది? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని ఆరె శ్యామల పేర్కొన్నారు.
 

Back to Top