ధర్మేంద్ర తరహాలోనే లోకేష్‌ రాజీనామా చేయాలి 

 
విజయవాడ:  ఏపీలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తుంది. లోకేష్‌పై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టత ఇ‍వ్వాలని, ఇప్పటివరకూ డీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఆ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది.   

డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్‌ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించింది. విచారణ నుంచి తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోందని, టీచర్‌ పోస్టుల కోసం బేరసారాల వీడియోలు బయటకొచ్చినా నామమాత్రపు కేసులతో విచారణను నీరుగార్చారని   వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని, ఇందులో నిజాలు నిగ్గు తేల్చే వరకూ ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని  వైయ‌స్ఆర్‌సీపీ హెచ్చరించింది. 

Back to Top