ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలి

మడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకు: అరకు నియోజకవర్గం అరకు వ్యాలీ మండలం మడగడ గ్రామపంచాయతీ పరిధిలోని మడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చేతి పంపు బోరు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైద్య సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన ఆయన, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

 గిరిజన గ్రామాలకు తాగునీటి భరోసా

అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చేతి పంపు బోరు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ప్రధాన సమస్యగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఈ బోరును మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, సూపర్ జడ్పీటీసీ సభ్యులు కమ్మిడి అశోక్, వైయస్సార్‌సీపీ అరకు వ్యాలీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్, మండల కార్యదర్శి గుజ్జేల ప్రసాద్, గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top