అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

హైదరాబాద్‌: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం గుండె సంబంధిత చికిత్సలో భాగంగా అంబటి రాంబాబుకు వైద్యులు స్టంట్ వేశారు. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రికి వెళ్లిన గోరంట్ల మాధవ్.. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.

 జూపూడి ప్రభాకరరావు ప‌రామ‌ర్శ‌
 అపోలో ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వైద్య చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిని జూపూడి ప్రభాకరరావు అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆయన ఆరోగ్యం, వైద్య చికిత్స పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అంబటి రాంబాబు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని, ఆరోగ్యంగా ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని జూపూడి ప్రభాకరరావు ఆకాంక్షించారు. 

Back to Top