తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతపై హత్యాయత్నం 

 అనంతపురం: తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గంగాదేవిపల్లి నుంచి తాడిపత్రికి వస్తున్న సమయంలో రోడ్డుకు ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. దాడిలో హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. తాడిపత్రిలో రాజకీయ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Back to Top