వైయస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా

శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ విప్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు

తాడేపల్లి: శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా బుధవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు విప్‌గా అవకాశం కల్పించినందుకు వైయస్‌ జగన్‌కు ఇసాక్‌ బాషా కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఇసాక్‌ బాషా తెలిపారు. తనకు అప్పగించిన విప్‌ బాధ్యతలను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌తో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషాను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
 

Back to Top