తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ జగన్‌ను కలిసిన మాధవరావు.. డిప్యూటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డిప్యూటీ ఛైర్మన్ పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మాధవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరావును వైయస్ జగన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సభా సంప్రదాయాలను కాపాడుతూ బాధ్యతలను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు కూడా వైయస్ జగన్‌ను కలిశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలిపారు.