తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి జైలు రిమాండ్‌లో ఉన్న తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన నాయకులు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైయస్ఆర్‌సీపీ నాయకత్వం, కార్యకర్తలు వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. తమ్మన శ్రీనివాస్‌పై నమోదైన కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పార్టీ తరఫున న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని జక్కంపూడి విజయలక్ష్మి, చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తూ వైయస్ఆర్‌సీపీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా తమ్మన శ్రీనివాస్‌కు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కుటుంబ సభ్యులు ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, న్యాయపోరాటంలో పార్టీ నాయకత్వం వారికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.