మాది రైతు పక్షపాత ప్రభుత్వం

రైతులకు అండగా నిలిచిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

వ్యవసాయ పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది

మరో 30 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ఉంటారు

చంద్రబాబు రైతుల ద్రోహి

బషీర్‌బాగ్‌ సంఘటన ఎవరూ మర్చిపోలేదు

కులం పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

 

అసెంబ్లీ: రైతులకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని, మొట్టమొదటి బడ్జెట్‌లోనే రైతాంగానికి రూ.28,866 కోట్లు కేటాయించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలకంటే రైతాంగం కోసం 67.35 శాతం అధికంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి వారికి వెన్నదన్నుగా నిలిచారన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అబ్బయ్యచౌదరి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లారంటే.. ‘ఈ దేశానికి వెన్నుముక రైతులు. అలాంటి రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని భావించారు సీఎం వైయస్‌ జగన్‌. తెలుగుదేశం పార్టీ రైతు ద్రోహి.. ఏనాడూ రైతులపై శ్రద్ధ చూపలేదు. మొదటి బడ్జెట్‌లోనే రూ. 28,866 కోట్లు రైతుల బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఇంతకు ముందు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు కేటాయించిన దానికంటే 67.35 శాతం ఎక్కువ కేటాయించాం. రైతు భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థ తీసుకురావాలని సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారు. ఆ సచివాలయాల్లోనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి 2 వేల పైచిలుకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది. రైతులకు అండగా నిలబడుతూ రైతు భరోసా ప్రకటించాం. రూ.12500 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం.. అంతకంటే మిన్నగా వెయ్యి రూపాయలు పెంచి రూ.13500 ఇచ్చాం. నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం ముందుగానే ఇచ్చాం. రైతులకు అండగా వైయస్‌ఆర్‌ ఒక్క అడుగు ముందుకు వేస్తే.. వైయస్‌ జగన్‌ రెండు అడుగులు వేశారు. రూ.50 వేలు కాదు.. రూ.67500 ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌.

చంద్రబాబు రైతు ద్రోహి.. ఏనాడూ రైతులకు అండగా నిలబడలేదు. విభజన జరిగిన తరువాత 15 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అది చంద్రబాబు పాపం వల్లే. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రైతులు మృతిచెందారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా అదే కొనసాగింది. కోఆపరేటీవ్‌ సొసైటీలను కూడా పార్టీ ఆఫీసులుగా మార్చి పూర్తిగా నాశనం చేశారు. వైయస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బషీర్‌బాగ్‌లో రైతులను ఏ విధంగా కాల్చిచంపారో మర్చిపోయారా..?

చంద్రబాబు హెలికాప్టర్‌ పార్కింగ్‌ కోసం కొత్తపాలెం, కొండివేడలో రైతుల భూములను నాశనం చేశారు.. అప్పుడు రైతు చనిపోయారు. వీళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రెయిన్‌గన్స్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డారు. 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి 15 సీట్లు వచ్చాయంటే.. రైతు రుణమాఫీ అని చంద్రబాబు మాయమాటలు చెప్పడం వల్లే.. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అంతా 2019లో 2 సీట్లకే టీడీపీని పరిమితం చేశారు.

బడ్జెట్‌లో కేటాయింపులోనే రైతులకు ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద రూ. 1163 కోట్లు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌. వైయస్‌ఆర్‌ రైతు బీమా పేరుతో రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. రైతు చనిపోతే రూ.7 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న ఏకైక ప్రభుత్వం మాది. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా సీఎం వైయస్‌ జగన్‌ పరిహారం అందిస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు కేటాయించాం. ప్రకృతి విపత్తుల నిధి కింద రూ.2 వేల కోట్లు కేటాయించాం. రూ. 200 కోట్లు కేటాయించి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. అనేక విషయాల్లో రైతులకు అండగా నిలబడుతున్నాం. హార్టికల్చర్‌ డిపార్టుమెంట్‌కు రూ. 1531 కోట్లు కేటాయించాం. మత్స్యకారులకు రూ.4 వేలు ఉన్న వేట నిషేధ సమయంలోని సాయాన్ని రూ.10 వేలకు పెంచి ఇస్తున్నాం. 96,662 మంది మత్స్యకారులకు రూ.10 వేలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌. వడ్డీలేని రుణాలకు రూ. 100 కోట్లు కేటాయించాం.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఫామ్‌ఆయిల్‌ రైతులకు ప్రభుత్వం అండగా నిలబడింది. రూ. 84 కోట్లు ఫామ్‌ఆయిల్‌ రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది. దెందులూరు నియోజకవర్గంలోని ఫామ్‌ఆయిల్‌ ఫ్యాక్టరీ రైతుల ద్వారానే నడిపిస్తానని సీఎం ప్రకటించారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును గోదావరి జిల్లాలకు మంజూరు చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక సీఎం వైయస్‌ జగన్‌. రైతులకు, విద్యార్థులకు, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు, మహిళలకు అండగా నిలబడుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌. గోదావరి జిల్లా వాసిగా పోలవరం త్వరగా పూర్తిచేయాలని, ఆక్వా హబ్‌ ఏర్పాటు చేసి యూనివర్సిటీని మా జిల్లాకు తీసుకురావాలి. హార్టికల్చర్‌ హబ్‌ను, కోకోవా కూడా బినామీల చేతుల్లో ఉంది.. ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కోకోవా ఫ్యాక్టరీలను పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

తెలుగుదేశం నాయకులు కులం గురించి మాట్లాడుతున్నారు. కులం అనేది వీళ్ల పేటెంట్‌లా మాట్లాడుతున్నారు. మా కుటుంబం 1985 నుంచి వైయస్‌ఆర్‌కు అండగా నిలబడింది. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు అయిన వైయస్‌ఆర్‌కు మాత్రమే అండగా నిలబడ్డాం. ఒక కులం వారు ఒకే పార్టీలో ఉన్నారనే భావన వీళ్లు కల్పిస్తున్నారు. కమ్మ, రెడ్డి, కాపుల్లో పేదలు లేరా..? వారి కోసం టీడీపీ ఏం చేసిందని అడుగుతున్నా..? మా ప్రభుత్వం వాళ్లకు కూడా అండగా నిలబడింది. వాళ్లకు కూడా అమ్మఒడి ఇస్తున్నాం, ఇళ్లు కట్టిస్తున్నాం, ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తున్నాం. కాపు కార్పొరేషన్‌ మాత్రమే కాకుండా కమ్మ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తుంది సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమేనని చంద్రబాబు గమనించాలి. ఇంకో 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉండేది సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలి.

Back to Top