సహజ వనరులే ఏపీ సంపద

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
 

 

ముంబై: సహజ వనరులే ఆంధ్రప్రదేశ్‌ సంపద అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పెట్రో, కెమికల్, న్యాచురల్‌ గ్యాస్‌ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముంబైలో జరిగిన సదస్సులో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఏపీకి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటా పెంచుతామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

Read Also: బీసీలంటే ఎందుకంత అక్కసు

తాజా ఫోటోలు

Back to Top