చంద్రబాబు, చైర్మన్‌ చరిత్రహీనులు 

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలకు ప్రజామోదం మెండుగా ఉంది

చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్‌ వ్యవహరించారు

ఆమోదమో? వ్యతిరేకమో తెలియజేయకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపారు

చంద్రబాబుకు తన స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు

మా సంక్షేమ పథకాలకు అడ్డుపడాలన్నది టీడీపీ ఉద్దేశం

రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలన్నది చంద్రబాబు ఆలోచన

దయచేసి ప్రజలు టీడీపీ కుట్రలను గమనించాలి

మంత్రి బొత్స సత్యనారాయణ

మీడియా పాయింట్‌: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం మెండుగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు చెబితే చైర్మన్‌ చేయడం సిగ్గు చేటు. చంద్రబాబు, చైర్మన్‌ చరిత్రహీనులుగా మిగిలిపోతారని మంత్రి అన్నారు. మీడియా పాయింట్‌లో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

ఇవాళ శాసన మండలిలో జరిగిన ఘటన చట్ట సభల్లో మాయని మచ్చ. చైర్మన్‌ను నిన్నటి నుంచి కూడా చట్టాన్ని, రాజ్యాంగం ప్రకారం చేయాలని మేం కోరాం. ఈ 13 జిల్లాల అభివృద్ధికి రెండు చట్టాలు అసెంబ్లీలో ఆమోదించాం. వీటిని మండలిలో ఆమోదించాలి..లేదా సలహాలు ఇవ్వాలి. కానీ ఇవాళ చైర్మన్‌ తన పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్‌ వ్యవహరించారు. అదే మాట చైర్మన్‌ నోటితోనే చెప్పారు. తప్పు చేసే వారికి విచక్షణాధికారం ఎక్కడుంటుంది. ఐదు కోట్ల మంది వైయస్‌ జగన్‌కు అధికారం ఇచ్చారు. రెండు చట్టాలను శాసన సభలో ఆమోదింపజేసుకున్నాం. ఇష్టమో, లేదో మండలిలో ప్రతిపక్ష సభ్యులు తేల్చాలి. నాన్చుడు ధోరణితో రాష్ట్ర ప్రజలకు  ఇబ్బందులు తలెత్తుతాయి.మండలి రూల్‌ బుక్‌ ప్రకారం చేయాలని చైర్మన్‌ను కోరాం. ఇవాళ చైర్మన్‌ చేసింది రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం ఉంటుంది. చట్టానికి లోబడకుండా విచక్షాణాధికారాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. అన్ని వర్గాలకు విచక్షణాధికారం ఉంటుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ, దుర్మార్గంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏమైనా చంద్రబాబుకు పట్టదు..ఆయనకు మాత్రం ఆస్తులు కాపాడుకోవడమే ముఖ్యంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలి. నీతిమాలిన కార్యక్రమాలను ప్రజలు గమనించాలి. ఇలాంటి చైర్మన్లు ఉంటే వ్యవస్థకే ప్రమాదం. దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు చరమగీతం పాడేంత  వరకు సీఎం వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటాం. 

Back to Top