కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క‌ష్ట‌కాలం

వ‌ర్షం కుర‌వ‌క‌పోతే పైర్లు ఎండిపోయే అవ‌కాశం ఉంది

ఉచిత పంట‌ల బీమాను కూట‌మి ప్ర‌భుత్వం తీసేసింది

అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి  ఆందోళ‌న‌

తాడేప‌ల్లి:  కూట‌మి ప్ర‌భుత్వంలో రైతుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని  అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  రాష్ట్రంలో వ్య‌వ‌సాయ ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `ఈ రోజు తిరుపతి, చిత్తూరు, సత్య సాయి జిల్లా, త‌ద‌త‌ర ప్రాంతాల్లో కొద్ది పాటి వర్షం పడినట్లు తెలుస్తుంది. రాబోయే రెండు రోజులలో వాతావరణం మారి వర్షం రాష్ట్రం వ్యాప్తంగా కురవక పోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. వర్షాధారిత ప్రాంతాలలో సాగు చేసిన ప‌త్తి, వేరు శనగ, అపరాలు ఎండి పోతున్నాయి.
కాలువల క్రింద ఎదపై సాగు చేసిన వరి, కొన్ని ప్రాంతాలలో వరి నారు మడులు నీరందక ఎండి పోతున్నాయి. కంది, వేరుశనగ జరగవలసిన సాధారణ సాగు కంటే తక్కువ జరిగినది. గత ఖరీఫ్ లో జరిగిన సాగు కంటే ఈ ఖరీఫ్ లో  
నంద్యాల, సత్య సాయి, అనంతపురం, అన్నమయ్య, కడప, చిత్తూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాలలో సాగు తగ్గింది. గత ప్రభుత్వం లో అమలు చేసిన ఉచిత ఇన్సూరెన్స్ పథకం ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరం కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కు వచ్చేది. సన్న, చిన్న కారు రైతులకు ఎంతో ఉపయోగ పడిన ఈ ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని కూట‌మి ప్ర‌భుత్వం తీసేసింది.  రైతులు ప్రేమియం చెల్లిస్తేనే కవరేజ్ కి వస్తారు.. రాష్ట్రంలో69.26 శాతం మంది రైతుల సరాసరి భూమి ఒక ఎకరం. ఆ తరువాత 19.31 శాతం మంది రైతుల సరాసరి భూమి 3.5 ఎకరాలు..రాష్ట్రం లో 88.57 శాతం మంది రైతులు ఈ సన్న, చిన్న కారు రైతులే..వీరిలో చాలా మంది రైతులు స్వయంగా భీమా ప్రీమియం చెల్లించ లేక కవరేజ్‌కు రాదు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా లో కరువు మూలం గా సాగు జరగకపోతే 25 శాతం నష్ట పరిహారం ఇవ్వాలి అని నిబంధన ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధన తొలగించారని చెబుతున్నారు. ఈ రెండు కారణాల మూలంగా లోటు వర్షపాత జిల్లాలలోని రైతులు తీవ్రంగా నష్ట పోతారు. పోటాష్ కాంబినేషన్ ఉన్న ఎరువుల ధరలన్నీ పెంచారు. సాధారణ సాగు జరగక పోయినా ఖరీఫ్ ప్రారంభం లోనే యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో  అవస్థలుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజుకు రాష్ట్రం మొత్తం సగటు లోటు వర్ష పాతం  -32.49 శాతం నమోదైనది. గత సంవత్సరం అనేక పంటల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక, ఈ ఖరీఫ్ లో ప్రకృతి అనుకూలించక రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉంది` అంటూ నాగిరెడ్డి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

 

Agriculture in Andhra Pradesh..facing an ALARMING situation..

Present Rainfall Status in Andhra Pradesh From June 01-2025 To Jul 17-2025(4.40 pm)
 
Normal Rainfall 166.9 mm
Actual Rainfall 112.68 mm
Deviation from Normal -32.49%

Out of 26 districts 14 districts are facing deficit rainfall problem..
Annamayya  -56.26 
Y. S. R. Kadapa  -61.93(Scanty)
Chittore  -26.31, 
Sri Satya Sai  -57.2, 
Thirupathi  -35.96,           
Nandyal  -28.71, 
Sri Potti Sriramulu Nellore  -54.57, 
Palnadu  -56.16, 
Guntur  -46.69, 
West Godavari      -33.1, 
Dr BR Ambedkar Konaseema  -43.27,
 Srikakulam  -22.98,
 Bapatla      -32.47,

Though Remaining 12 districts received average rainfall (-19 to +19)
Alluri Sitharama Raju         -16.92
East Godavari   -18.39
Ananthapuram  -17.08
Kakinada  -17.29 
Krishna      -15.72
are in a short fall..

Only vijayanagaram   +15.88 and Visakhapatnam  +16.35 are having more than +10% average rainfall..

Back to Top