డాక్టర్ చంద్రబాబు అసలు గుట్టు ఇది..!

ఏ విషయం అయినా తనకు అనుకూలంగా మార్చుకోవటం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన డాక్టరేట్ విషయంలో కూడా అదే జరుగుతోంది.

చంద్రబాబు చేసిన సేవలకు మెచ్చి అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది అని ప్రచారం చేసుకొంటున్నారు. దేశంలోని అనేక యూనివర్శిటీలు డాక్టరేట్ ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ..దానిని తాను తిరస్కరించానని, కానీ ప్రతిష్టాత్మక యూనివర్శిటీ కావటంతో దీన్ని అంగీకరిస్తున్నానని చెప్పుకొన్నారు. అమెరికాలో ఒక సాధారణ యూనివర్సిటీ మాత్రమే ఆయనకు డాక్టరేట్ ఇస్తుండగా, టీడీపీ.. దాని అనుకూల మీడియా మాత్రం ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన షికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు కథనాలు ప్రచురించాయి. అసలు సంగతి ఏమిటంటే, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్సిటీ అని రెండు ఉన్నాయి.

అమెరికాలోని టాప్ టెన్‌ విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఉంది. కానీ, షికాగో స్టేట్ యూనివర్సిటీ మాత్రం ఒక నామమాత్రపు యూనివర్శిటీ. ఇందులో  తెలుగువాడైన రవి ఆచంట కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ షికాగో స్టేట్ యూనివర్శిటీ తో మన జేఎన్టీయూ కి ఎమ్ ఓ యూ కుదిర్చారు. కోట్ల రూపాయిల విలువ చేసే ఈ డీల్ చేసినందుకు గాను, ఆ యూనివర్శిటీ డాక్టరేట్ ను సమర్పించుకొంటోందన్న మాట. ఆ మాత్రం దానికి పచ్చ మీడియా బోలెడంత ప్రచారం చేసుకొంటోంది.

 

Back to Top