ఉత్తరాఖండ్ బాధితులకు విజయమ్మ పరామర్శ

విజయవాడ 22 జూన్ 2013:

ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్ళి ఇక్కట్ల పాలైన విజయవాడకు చెందిన కుటుంబాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పరామర్శించారు. శనివారం ఉదయం ఆమె విజయవాడలోని బావాజీ పేటకు వెళ్ళారు. ఆయా కుటుంబాలను ఓదార్చారు.
ఇలాంటి విపత్తు జరిగుండాల్సింది కాదని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ఈ హఠాత్పరిణామనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులను ఆదుకునే చర్యలు చేపడతామని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగారికి లేఖ కూడా రాశామన్నారు. ఉత్తరాఖండ్‌లో ఇరుక్కుపోయిన మన రాష్ట్రానికి చెందిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా అన్ని ప్రయత్నాలూ చేస్తామని వారికి ఆమె హామీ ఇచ్చారు. బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు.

Back to Top