నీళ్ళు లేకున్నా మద్యానికి కొదవ లేదు

రాజానగరం 06 జూన్ 2013:

కాంగ్రెస్ సర్కారు హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని శ్రీమతి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీళ్ళు లేవు, కరెంటు లేవు, ఉద్యోగాలు లేవు.. కానీ మద్యానికి మాత్రం కొదవ లేదని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడని మొన్న ఓ అక్క తనకు చెప్పిందని తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్క జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజానగరంలో ఈ సభ ఏర్పాటుచేశారు.

చంద్రబాబు నాయుడు వైఖరిపై ధ్వజం
పేదలనుంచి వైద్యానికి యూజర్ చార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబని చెప్పారు. 50 రూపాయలున్న హార్సు పవర్ ని 650రూపాయలు చేసింది కూడా ఆయనే. ప్రతి ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబే. ఉచితంగా కరెంటు ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరావని కూడా ఆయనే హేళన చేశారని గుర్తుచేశారు. పేదల్ని, రైతుల్ని పురుగుల్లా చూశాడన్నారు. ఆయన హయాంలో పొట్టకూటి కోసం లక్షలాదిమంది రాష్ట్రాన్ని వదిలి వెళ్లారన్నారు. ఎనిమిదేళ్ళలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచాదరన్నారు. నష్టాల్లో ఉన్నామనీ, కట్టలేమన్న రైతులపై కేసులు కట్టి,  జైల్లో పెట్టారురన్నారు. అవమానం భరించలేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదనతో చెప్పారు.  
ఆయన స్థాపించిన హెరిటేజ్ సంస్థకు దేశవ్యాప్తంగా కార్యాలయాలున్నయన్నారు. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తన బినామీలకు కట్టబెట్టేసుకున్నారని శ్రీమతి షర్మిల చెప్పారు. దేశ విదేశాల్లో చంద్రబాబుకు ఆస్తులున్నాయన్నారు. ఆయన అవినీతి గురించి కమ్యూనిస్టులు 'బాబు జమానా.. అవినీతి జఖనా' అని ఓ పుస్తకమే రాసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబుకు మించిన అవినీతిపరుడు లేడని ఆయన మామగారైన ఎన్టీరామారావు గారే చెప్పారన్నారు. నక్కత్తుల చంద్రబాబుకు పదవీ వ్యామోహం, ధన కాంక్ష రక్తంలో ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు తనకు తిరిగి అధికారాన్ని ఇస్తే రాష్ట్రాన్నే కాక దేశాన్ని కూడా గాడిలో పెడతానని చెప్పి తిరుగుతున్నాడని ఆమె ఎద్దేవా చేశారు.

అన్నిటికీ అతీతంగా ఆలోచించారు రాజన్న
మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాలన ఓ  సువర్ణయుగమని ఆమె అభివర్ణించారు. ఆయన ఒక తండ్రిలా ఆలోచించారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించారన్నారు. ప్రతి తెలుగువాడు ఆనందంగా ఉండాలని రాజన్న అభిలషించారన్నారు.  రైతులకు ప్రోత్సాహమిచ్చారు. నీళ్ళిచ్చారు, కరెంటు ఇచ్చారు., సబ్సిడీ ఇచ్చారు. వడ్డీ మాఫీ చేశారు. విద్యుత్తు బకాయిలు కూడా మాఫీ చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డిగారిది. ఒకసారి 1200 కోట్ల రూపాయల విద్యుత్తు బకాయిలను మాఫీ చేశారన్నారు. రైతుల రుణాలమీద 300 కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేశారని తెలిపారు. మరోసారి 12 వేల కోట్లతో రుణమాఫీ కూడా చేశారని శ్రీమతి షర్మిల చెప్పారు.

రైతులకి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. బ్యాంకుకు వెళ్ళని మహిళలు కూడా వెళ్లి రుణాలు తీసుకున్నారు. పేదరికం ఊబిలోంచి బయటకు రావాలని మహానేత విద్యార్థులకోసం ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారు. భరోసా కల్పించారు. లక్షలమంది గొప్ప చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆరోగ్యశ్రీ.. పెట్టారు. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు.  ఐదేళ్ళలో 50 లక్షల ఇళ్ళు కట్టారు. ఇప్పడుండి ఉంటే రెండో టెర్ములో మరో 50 లక్షల ఇళ్ళు కట్టించి ఉండే వారని చెప్పారు. 'చంద్రబబాబు తన హయాంలో 16 లక్షల మందికి పింఛన్లిస్తే రాజన్న 70 లక్షల మందికి పింఛన్లు అందించారు. ఆయన తన పాలనలో ఒక్క చార్జీ పెంచలేదు. గ్యాస్ ధర 305 దాటలేదు. ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఒక్క రూపాయి కరెంటు చార్జీలు పెంచారని ప్రతిపక్షాలు కూడా అనలేదు. పేదవారిపై భార పడకూడదనుకుని రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు' అని ఆమె రాజన్న మనసును వివరించారు.

కరెంటు లేదు.. నీళ్ళు లేవు.. మద్దతు ధర లేదు.. ధరలు పెరిగిపోయాయని మహిళలు, రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి పాలనను శ్రీమతి షర్మిల తూర్పారబట్టారు.  పిల్లలు కూలీకి వెళ్ళకపోతే డబ్బులురావు, కుటుంబం గడవదని వాపోతున్నారు.

కిరణ్ కుమార్ హయాంలో రైతులకి నీళ్ళు బంద్, గ్రామాలకి కరెంటు బంద్, పిల్లలకి చదువులు బంద్, కార్మికులకి పనులు బంద్, పరిశ్రమలకి కరెంటు బంద్.. ఫలితంగా మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్ అని ఆమె ఎద్దేవా చేశారు. పరిస్థితి తీవ్రత ఇలా ఉన్నా మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. ప్రజలకి మనశ్శాంతి కరవైందన్నారు. మద్యం వల్ల వచ్చే ఆదాయాన్ని నాలుగేళ్ళలో రెట్టింపు చేయడమే దీనికి ఉదాహరణన్నారు. ప్రతి కుటుంబానికీ కిరణ్ సర్కారు నష్టం చేస్తోందన్నారు. రాజన్న ఉండుంటే తొమ్మిది గంటలు కరెంటొచ్చేది.. ఇప్పుడు మూడు గంటలు మాత్రమే వస్తోందన్నారు. గ్రామాల్లో ఎక్కడా కరెంటు లేదన్నారు. కరెంటు లేకుండా వండుకోవాలి.. అలాగే పడుకోవాలి అని ప్రజలు చెబుతున్నారన్నారు. కరెంటు ఇవ్వకుండా మూడు రెట్లు బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ వైఖరికి నిరసనగా అవిశ్వాసం పెడితే చంద్రబాబు రక్షణ కవచంలా నిలబడి ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. తనపై విచారణ జరగకుండా ఉండేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలన్న ఉద్దేశంతోనే జగనన్నపై కేసులు పెట్టి జైలులో పాలుచేశారని చెప్పారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు వస్తారు... రాజన్న రాజ్యాన్ని తెస్తారు.. అని శ్రీమతి షర్మిల తన ప్రసంగాన్ని ముగించారు.

తాజా వీడియోలు

Back to Top