విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం  

వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వ‌జం

బాపట్ల జిల్లా : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారీ భారం మోపుతోందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే FPPCA చార్జీల పేరుతో మరింత మొత్తం వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందని ఆరోపించారు. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పెద్ద సంఖ్యలో గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో గతంలో ఒక విధంగా వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మరో విధంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.

Back to Top